Friday, November 22, 2024

‘మ‌గ‌బిడ్డ‌’కు జ‌న్మ‌నిచ్చిన భూమా అఖిల ప్రియా

మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిల‌ప్రియా పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ వెల్ల‌డించారు. అఖిల‌ప్రియ త‌న బిడ్డ‌తో ఉన్న ఫొటోని షేర్ చేశారు. కాగా త‌న త‌ల్లి శోభానాగిరెడ్డి జ‌యంతి రోజునే అఖిల‌ప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. భూమా నాగిరెడ్డి మళ్లీ ఇలా పుట్టారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భూమా అఖిల ప్రియ మంత్రిగా ఉన్న సమయంలో భార్గవ రామ్ ను వివాహం చేసుకున్నారు. ఈ చిన్నారి రాక‌తో ఆ ఇంట సంబ‌రాలు మొద‌ల‌య్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement