మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లో చెందిన బాబుల్.. బీజేపీ ఎంపీగా గెలిచారు. అనంతరం కేంద్ర మంత్రి అయ్యారు. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తృణమూల్లో చేరినప్పటికీ ఎంపీగా కొనసాగుతున్నారు. బీజేపీ గుర్తుతో గెలిచిన ఆయన.. ఎంపీగా కొనసాగకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను మంగళవారం పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను కలిసి సమర్పించనున్నారు. కాగా, బాబుల్ సుప్రియో రాజీనామా చేస్తే అమోదం పొందితే.. ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: హుజురా బాద్షా ఎవరు? ప్రచారానికి ఇంకా పది రోజులే!