Wednesday, November 20, 2024

తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అధికారులు ఎత్తివేశారు. కేంద్ర జలసంఘం, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు కలిసి గేట్లు పైకి ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబర్‌ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90.313 సామర్థ్యం కాగా.. ప్రస్తుతం 26 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉండడంతో ఎస్సారెస్పీలోకి మరింత నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న జలవివాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement