Saturday, November 23, 2024

బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. 1 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌ ప్రభన్యూస్‌, ప్రతినిధి: బీఎస్సీ(ఎంఎల్‌టీ), బీఎస్సీ అనేస్తేషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్‌, కార్డియో వాస్క్యూలర్‌ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, బీఎస్సీ అఎ్టోమెట్రి, బిఎస్సీ రెస్పిరేటరీ థెరిపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్‌ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియోలజీ, స్పీచ్‌ థెరిపీ టెక్నాలజీ,బీఎస్సీ మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్‌, బీఎస్సీ న్యూక్లియర్‌ మెడిసిన్‌,బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ తదితర నూతన కోర్సులను ఈ ఏడాది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టింది.

బీఎస్సీ అలాయిడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నేడు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ప్రభుత్వ అనుమతితో బిఎస్సీ అనేస్తేషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్‌, కార్డియో వాస్క్యూలర్‌ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్‌ డయాలిసిస్‌ టెక్నాలజీ, బీఎస్సీ అఎ్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరిపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్‌ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ,బీఎస్సీ ఆడియాలజీ, స్పీచ్‌ థెరిపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్‌, బీఎస్సీ న్యూక్లియర్‌ మెడిసిన్‌, బీఎస్సీ రేడియో థిెం పీ టెక్నాలజీ తదితర నూతన కోర్సులను ఈఏడాదిలో ప్రవేశపెట్టింది.

గతంలో ఉన్న బీఎస్సీ(ఎంఎల్‌టీ) కోర్సుతో పాటు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కోర్సులకు జనవరి 1 నుంచి 10వ తేదివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ధృవపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒకప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement