Friday, November 22, 2024

బి అగ్రహారం శ్మశాన సమస్య.. శవంతో సచివాలయం ఎదుట ధర్నా

కర్నూలు : గోనెగండ్ల మండలం, బి అగ్రహారం గ్రామం లో రెండు నెలలుగా స్మశాన సమస్య తలెత్తింది.. దీనికిశాశ్వత పరిష్కారం చూపని కారణంగా మళ్ళీ ఆందోళన మొదలైయ్యింది. గ్రామానికి చెందిన అదెమ్మ అనే మహిళ గురువారం మృతి చెందారు. అయితే గ్రామంలోని వివాదస్పద స్మశాన వాటిక లో శవంను పూడ్చేందుకు వెళ్ళిన గ్రామస్థులను కొంత మంది అడ్డుకున్నారు.

అగ్రహారం గ్రామంలో ఉదయం నుండి స్మశాన సమస్య పరిష్కారం కోసం ఎదురు చూసిన గ్రామ ప్రజలు, ఎంతకీ అధికారులు స్పందించక పోవడంతో.. కోపోద్రిక్తులైన మహిళలు గ్రామ సచివాలయం వద్దకే అదెమ్మ శవాన్ని తీసుకవచ్చి, సచివాలయం ముందే పూడ్చేందుకు గుంతను తవ్వారు.

- Advertisement -

గుంతను తవ్వుతున్నా సచివాలయం లోకి వెళ్లి బయటకు రాని తహసీల్దార్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. అరగంట ఆందోళన అనంతరం బయటకు వచ్చిన తహసీల్దార్ మాట్లాడుతూ, ఎవరైతే కోర్టుకు వెళ్లి మీకు కేటాయించిన స్థలం పై స్టే తెచ్చుకున్నారో, అతను ఫెక్ పట్టాలు పెట్టారు. అతడు గ్రామంలో భూస్వామి, ఇక్కడే కాదు ములుగుందంలో కూడా అతనికి భూమి ఉంది అని తేల్చాము. స్టే వెకెట్ కు కోర్టుకు వెలుతాము. కోర్టులో ఉన్నకారణంగా వెళ్లలేము. స్టేలో లేని భూమి చూపిస్తాం అని హామీ ఇచ్చారు.

హామీతో సర్వే నెం 244/1 వద్దకు వచ్చిన ప్రజానీకాన్ని కొలతలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, తిరిగి ఆందోళనతో ఆకుపై చేసుకున్న చేను చివరిలోనే గుంతతీయించి పూడ్పించారు.

కార్యక్రమం లో మండల తహసీల్దార్, సిఐ, ఎమ్మిగనూరు రూరల్ యస్ ఐ, నందవరం యస్ ఐ, కెవిపియస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, బియస్పి నాయకులు లక్ష్మి నారాయణ, ఎర్రన్న, రైతుసంఘం నాయకులు నరసింహులు, కెవిపియస్ గ్రామ నాయకులు గిరిరాజు, రంగస్వామి, బాలరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement