కేరళ శబరిమల దేవస్థానం తలుపులు మూతపడనున్నాయి. నేడు మండల పూజ అనంతరం అయ్యప్ప ఆలయాన్ని రాత్రి 11గంటలకు మూసివేయనున్నారు.
తిరిగి మకరవిళక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులను తెరుస్తారు. అప్పటి నుంచి మకరజ్యోతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అయ్యప్పల మాల విరమణల అనంతరం జనవరి 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. అయ్యప్పస్వామి సన్నిధానం తలుపులు నేటితో మూసుకుంటాయని తెలియడంతో భక్తులు లక్షలాదిగా శబరిమలకు చేరుకున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్ప దర్శనానికి సుమారు 15 గంటలకు పైగా సమయం పడుతోందని ట్రావెన్ కోర్ బోర్డ్ అధికారులే తెలిపారు.