Thursday, November 21, 2024

విశాఖ భూములు.. అమ్మాల్సిన అవసరమేంటి?

తుగ్లక్ సీఎం జగన్ విశాఖపట్టనాన్ని అమ్మకానికి పెట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భూములన్నీ ముఖ్యమంత్రి ఆశీస్సులతో అమ్మేస్తున్నారని ఆరోపించారు. విశాఖలోని భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖలో అమ్మకం చేసే 18 స్థలాలు, 17 ఎకరాల విలువ రూ.1,500 కోట్లు ఉంటుందని తెలిపారు. అంత విలువైన భూముల్ని అమ్మకానికి 22న టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు. వీటిని ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయ్యిందని, నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు నిధుల కొరత ఏర్పడిందని అయ్యన్న అన్నారు. ప్రచారం, ఆర్భాటం ఎక్కువ… లెక్కలేనంత దుభారా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల్ని, దేవాలయ భూములు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థను బాగుచేయడం చేతకాని ముఖ్యమంత్రి, ఇలా భూములను అమ్మకం చేస్తే, భవిషత్తు అవసరాలకు భూములు ఎక్కడ నుంచి వస్తాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో భవిషత్తు తరాలకు ఇబ్బంది తలెత్తుతుందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విశాఖ భవిషత్తు కోసం అందరూ మాట్లాడాలని అయ్యన్నపాత్రుడు కోరార

Advertisement

తాజా వార్తలు

Advertisement