Tuesday, November 26, 2024

‘ఆయుష్మాన్‌ భారత్‌’ – ప్ర‌చారం ఘ‌నం – అమ‌లే అథ‌మం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఒకవైపు అవగాహన లోపం, మరోవైపు సాంకేతిక సమస్య.. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని పేదలకు అందకుండా చేస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందే అవకాశముందన్న వార్తలతో గ్రామస్థాయి నుంచి అనేక మంది ఈ సథకంలో చేరారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 46 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డులు ఉన్నాయి. కానీ ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేకపోయారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ”పీఎం జన్‌ ఆరోగ్య యోజన” పేరుతో ప్రారంభమైన ఈ పథకం 2022 డిసెంబర్‌ వరకు తెలంగాణాలో అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకా ల్లో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే నోడల్‌ ఏజెన్సీగా ఉంటుంది. కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభిం చక ముందునుంచే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉన్నందున కేసీఆర్‌ సర్కారు అమలుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో 2023 జనవరి నుంచి తెలంగాణాలో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గరిష్టంగా రూ.2 లక్షల వరకే వైద్య సేవల గరిష్ట పరిమితి ఉండడంతో అనేక మంది పేద, మధ్య తరగతి వర్గాలు ఆయుష్మాన్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పథకంపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఆ మేరకు లబ్ధిదారులకు ప్రతిఫలం మాత్రం దక్కడంలేదు. చేతిలో కార్డులున్నాయి.. కదా అని ఆరోగ్య సమస్య వచ్చి ఆస్పత్రులకు వెళితే, ఆ కార్డులు అమల్లో లేవంటే వచ్చే సమాధానంతో అబాసుపాలవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయుష్మాన్‌ భారత్‌ కింద 7,09,990 లక్షల మంది రోగులు ఆస్పత్రుల్లో చేరారు. దీనికి రూ.2,012 కోట్లు- ఖర్చు చేశారు. అందులో రూ.236.05 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి విడు దల చేసినట్లు- కేంద్రం తాజాగా పార్లమెంట్‌ వేదికగా వెల్లడించిం ది. తెలంగాణలో ఇప్పటి వరకు 45,98,988 మందికి ఆయు ష్మాన్‌ భారత్‌ గుర్తింపు కార్డులు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 746 ఆస్పత్రులు ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో కొనసాగుతున్నట్లు లెక్కలున్నాయి. కానీ ఒక్క ఆస్పత్రికి కూడా ప్రభుత్వ పరంగా మార్గదర్శకాలు లేకపోవడంతో అమలు ప్రశ్నార్థకంగానే మిగిలింది. తెలంగాణలో ఈ పథకంలో 29,02,621 కుటుంబాలు అర్హత కలిగి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద పథకమని ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు చికిత్స పొందే అవకాశం ఉందని కేంద్రం ప్రచారం చేస్తోంది.

కానీ, రాష్ట్ర ప్రభుత్వాలపై అజమా యిషీ లేకపోవడంతో అమల్లో చిక్కులు తప్పడంలేదు. దేశ వ్యాప్తంగా 26,434 ఆస్పత్రులు ఈ పథకంలో ఉండగా అందులో 11,500 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2023 మార్చి 20 వరకు 23.3 కోట్ల లబ్ధిదారులు ఈ పథకం కింద పరీక్షలు చేసుకున్నట్లు లెక్కలున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 4.49 కోట్ల మంది చేరగా, ఇందుకు గాను రూ.54,224 కోట్ల ఖర్చు అయ్యిందని కేంద్రం వెల్లడించింది.

ఇవీ వాస్తవాలు
ఆయుష్మాన్‌ భారత్‌లో 60శాతం కేంద్రం వాటా
ఆయుష్మాన్‌ భారత్‌ నిధులను పూర్తిగా కేంద్రప్రభుత్వం ఇవ్వదు. 60 శాతం నిధులను కేంద్రం ఇస్తే.. 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం రూ.859 కోట్లు- ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రానికి కేవలం రూ.150 కోట్లు- మాత్రమే ఇచ్చింది. కేంద్రం స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారం.. ఆయుష్మాన్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో రోగికి సగటు-న రూ.11,924 మాత్రమే ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రోగిపై సగటు-న రూ.46,250 ఖర్చు చేసింది. అంటే నాలుగు రెట్లు- ఎక్కువ. అవయవ మార్పిడులు, క్యాన్సర్‌ చికిత్సల వంటి ఖరీదైన వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు మంజూరు చేస్తున్నది. కానీ ఈ వ్యయంలో కేంద్రం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వదు.

- Advertisement -

ఈ-కేవైసీ చేస్తేనే అర్హులు
ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలులో భాగంగా తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటు-ంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద నియమించిన ఆరోగ్య మిత్రలతో పాటు- సీఎస్సీ సెంటర్‌ ఆపరేటర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఈ-కేవైసీ వివరాలు నమోదు చేస్తున్నారు. మరికొందరు సీఎస్సీ సెంటర్లలో ఈ-కేవైసీ వివరాలు నమోదు చేసుకొని ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేరుతున్నారు. పీఎం-జేఏవై వెబ్‌సైట్‌లో లబ్ధిదారుడి రేషన్‌కార్డు నంబర్‌ నమోదు చేయగానే రేషన్‌ కార్డులో ఉన్న కుటు-ంబ సభ్యులందరి పేర్లు వస్తాయి. ఒక్కొక్కరి ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తీసుకుని ఆప్‌లోడ్‌ చేసి ఈ-కేవైసీ పూర్తి చేస్తారు.

గద్వాల జిల్లాలో..
గద్వాల జిల్లాలో 2,19,453 రేషన్‌ కార్డులున్నాయి. వీటిలో 6,48,938 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుండగా, ఇందులో ఇప్పటికి దాదాపుగా 60 వేల కార్డుదారుల వివరాలు మాత్రమే ఆయుష్మాన్‌ భారత్‌కు అనుసంధానం చేశారు. అనుసంధాన ప్రక్రియ అంతా ఉచితం గానే చేయాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు-గా ఆరోపణలు వస్తున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో..
భూపాలపల్లి జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ ఈ కేవైసీ కార్యక్రమం సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,23,640 లక్షల తెల్లరేషన్‌ కార్డులుండగా ఇప్పటి వకు కేవలం 53,603 మంది (43శాతం) మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3,51,940 తెల్లరేషన్‌ కార్డులుండగా ఇప్పటి వరకు కేవలం 80,250 మంది మాత్రమే ఈ-కేవైసీ వివరాలు పూర్తిచేసినట్లు- ఆరోగ్యశ్రీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనున్న నే
పథ్యంలో లబ్ధిదారులందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ అలాంటి గడువేమీ లేదంటూ అధికారులు చెబుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో 2,19,453 రేషన్‌ కార్డులు ఉన్నా యి. వీటిలో 6,48,938 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరంద రికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుండగా, ఇందులో ఇప్పటికి దాదాపుగా 68వేల కార్డుదారుల వివరాలు మాత్రమే ఆయుష్మాన్‌ భారత్‌కు అనుసంధానం చేశారు. అనుసంధాన ప్రక్రియ అంతా ఉచితంగానే చేయాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు-గా ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement