అయోధ్య రామమందిర ట్రస్టు టీటీడీ సాయం కోరింది. దీంతో వెంటనే స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డిని, అధికారుల బృందం అయోధ్యకు పంపింది. ట్రస్టు ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. బాలరాముడి ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.
అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది. ఈ క్రమంలో అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం మేరకు టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి శనివారం సాయంత్రం అయోధ్యకు వెళ్లారు. మూడు రోజులు క్రితమే అయోధ్యకు టీటీడీ ప్రతినిధులును ఈవో ధర్మారెడ్డి పంపారు.