అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ జరిగింది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలను సేకరించిన సంగతి తెలిసిందే. అయితే విరాళాలలో క్యాస్ తో పాటు చెక్ కూడా ఇచ్చారు చాలా మంద. వీటిపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేసిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని తేలింది. ఆ చెక్కుల విలువ రూ.22 కోట్ల వరకు ఉంటుంది. బ్యాంకులలో నిధులు లేకపోవడం వల్లగానీ, లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లగానీ చెక్కులు బౌన్స్ అయి ఉండొచ్చని ఆడిట్ నివేదికలో ట్రస్ట్ పేర్కొంది. ప్రజలు వీలైతే మళ్లీ విరాళాలు సమర్పించాలని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా కోరారు.
రామ మందిర విరాళాలల్లో 15 వేల చెక్కులు బౌన్స్
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement