Friday, November 22, 2024

Ayappa Swamy – తెర‌చుకున్న శ‌బ‌రిమ‌ల త‌లుపులు… పోటెత్తిన అయ్య‌ప్ప‌లు…

కేరళలోని పతనంతిట్టలోని శబరిమలలో మండల పూజలు పూర్తికావడంతో మూసివేసిన అయ్యప్ప ఆలయాన్ని తిరిగి నేటి తెల్ల‌వారుఝామ‌న మకరవిలక్కు కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనం పోటెత్తారు. ప్రజలు ఏడాది చివరి రోజున శబరిమల ఆలయానికి తరలివచ్చారు. అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రజలు క్యూలలో నిలబడి ఎదురుచూస్తున్నారు. తెల్ల‌వారు ఝామున త‌లుపులు తెర‌వ‌డంతో భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు..

అలాగే జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించి, 15న మకరవిలక్కు వేడుకను జరపనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అయితే, గతంలో ఎన్నడూ లేనివిధంగా మండల పూజల సీజన్‌కు భక్తులు పోటెత్తడంతో మకర జ్యోతి సందర్భంగా విర్చువల్ క్యూ టిక్కెట్ల జారీ విషయంలో టీబీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్‌లను 50,000కి తగ్గించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పీసీ ప్రశాంత్ చెప్పారు. రెండు రోజులలో ఆలయం అత్యంత రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి 15న మకర జ్యోతి రోజున రద్దీని అదుపులో ఉంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు టీడీబీ ఛైర్మన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement