Monday, November 25, 2024

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 50, 21న ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌ఓ

భారతదేశంలో సుప్రసిద్ధ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో ఒకటైన యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తమ యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ (నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 50 ఇండెక్స్‌ను ట్రాకింగ్‌ చేసే ఓపెన్‌ ఎండెడ్‌ ఇండెక్స్‌ ఫండ్‌)ను బుధవారం విడుదల చేసింది. ఈక్విటీ హెడ్‌ జినేష్‌ గోపానీ నిర్వహించనున్న ఈ ఫండ్‌ నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50 ట్రై ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ ఫిబ్రవరి 21న ప్రారంభమైంది. 2022, మార్చి 07న మూసివేయబడుతుంది. కనీస అప్లికేషన్‌ మొత్తం రూ.5వేలుగా నిర్ణయించారు. ఎగ్జిట్‌ లోడ్‌ ఏమీ లేదు. యాక్సిస్‌ ఏఎంసీ ఎండీ అండ్‌ సీఈఓ చంద్రేష్‌ నిగమ్‌ మాట్లాడుతూ.. యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ తీసుకురావడం ద్వారా.. తమ మదుపరులకు తగిన రాబడులను అందించగలగడంతో పాటుగా నాణ్యత, వ్యాప్తి, స్థిరత్వంను పోర్ట్‌ ఫోలియోకు అందింగలమని భావిస్తున్నట్టు తెలిపారు.

రోజు వారీ టర్నోవర్‌ ప్రాతిపదికన..

సెమీ-యానువల్‌ ప్రాతిపదికన రీబ్యాలెన్స్‌ చేయబడిన.. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 50, ఇండెక్స్‌ నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 250 ఇండెక్స్‌లో పూర్తి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. టాప్‌ 100 కంపెనీల నుంచి సగటు రోజువారీ టర్నోవర్‌ ఆధారంగా ఎంపిక చేయబడిన టాప్‌ 50 కంపెనీలను ఇది సూచిస్తుంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పద్ధతిని ఉపయోగించి లెక్కించబడుతుంది. ఇందులో ఇండెక్స్‌ స్థాయి నిర్ధిష్ట బేస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువకు సంబంధించి ఇండెక్స్‌లోని అన్ని స్టాక్‌ల మొత్తం ఉచిత ఫ్లోట్‌ మార్కెట్‌ విలువను ప్రతిబింబిస్తుంది. యాక్సిస్‌ నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 50 ఇండెక్స్‌ ఫండ్‌ దాని పోర్ట్‌ఫోలియోలో నాణ్యత, స్కేలబిలిటీ, స్థిరతం కోసం చూసేందుకు ఓ పద్ధతిని రూపొందించబడింది. అధిక పనితీరు గల వృద్ధి వ్యాపారాలను గుర్తించే మార్కెట్‌ సామర్థ్యంపై ఆధారపడటం ద్వారా.. ఫండ్‌ 6 నెలల వ్యవధిలో సగటు రోజువారీ టర్నోవర్‌ ద్వారా అత్యంత లికిడ్‌ స్మాల్‌ క్యాప్‌లను ఎంచుకుంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement