భారతదేశంలో అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న ఫండ్ హౌస్‌లలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తమ నూతన ఫండ్ ఆఫర్ యాక్సిస్ క్రిసిల్ ఎస్డీఎల్ 2027 డెబ్ట్ ఇండెక్స్ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది టార్గెట్ మెచ్చూరిటీ ఇండెక్స్ ఫండ్. దీని బెంచ్ మార్క్ మెచ్యూరిటీ మే 31, 2027. ఈ నూతన ఫండ్, క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ ఇండెక్స్ మే 2027ను ట్రాక్ చేస్తుంది. ఈ పోర్ట్ ఫోలియోను ప్రధానంగా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్)లో పెట్టుబడి పెట్టేందుకు తీర్చిదిద్దారు. డిసెంబర్ 01, 2026 నుంచి మే 31, 2027 మధ్య ఇది మెచ్చూర్ కానుంది. క్రిసిల్ ఇండిసీస్ లిమిటెడ్ ఈ ఇండెక్స్‌ను నిర్వహించనుంది. ఈ ఎన్ఎఫ్ఓ విడుదలపై యాక్సిస్ ఏఎంసీ ఎండీ అండ్ సీఈఓ చంద్రేష్ నిగమ్ మాట్లాడారు.
విస్తృత శ్రేణిలో మదుపరులకు ఆకర్షణీయమైన పెట్టుబడి ప్రతిపాదనగా పాసివ్ ఇన్వెస్ట్మెంట్ విభాగాన్ని నిర్మించే దిశగా చేస్తున్న చేస్తున్న ముందడుగు యాక్సిస్ క్రిసిల్ ఎస్డీఎల్ 2027 డెబ్ట్ ఇండెక్స్ ఫండ్. ఓ ఫండ్ హౌస్‌గా బాధ్యతాయుతమైన పెట్టుబడిన తాము విశ్వసిస్తుంటాం. నాణ్యమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం తాము మదుపరులకు అందిస్తున్నాం. ఈ ఫండ్ మా మదుపరులకు దీర్ఘ కాలపు సంపద సృష్టిస్తుందనే విశ్వాసంతో ఉన్నామని చంద్రేష్ నిగమ్ అన్నారు. ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్.. ప్రధానంగా అత్యధిక వడ్డీ రేట్ రిస్క్, అతి తక్కువ క్రెడిట్ రిస్క్ కలిగిన క్రిసిల్ ఐబీఎక్స్ ఎస్డీఎల్ ఇండెక్స్. మే 2027 సంబంధిత అంశాలలో పెట్టుబడి పెడుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..