Friday, November 22, 2024

యాక్సిస్‌ బ్యాంక్‌ నికర లాభం 4,125 కోట్లు

బ్యాంక్‌ యాక్సిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్‌ 4,125 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంక్‌ నికర లాభం 2,160 కోట్లు. నికర వడ్డీ ఆదాయం 7,760 కో ట్ల నుంచి 9,384 కోట్లకు అంటే 21 శాతం పెరిగినట్లు తెలిపింది.

బ్యాంక్‌ ఆదాయం 11,119 కోట్ల నుంచి 12,383 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ సీఈవో అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ చౌదరి తెలిపారు. రిటైల్‌ లోన్స్‌ 25 శాతం, ఎస్‌ఎంఈ లోన్స్‌ 27 శాతం పెరిగాయని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement