Tuesday, November 19, 2024

ఆర్పీఎఫ్‌ ఆధ్వర్యంలో ట్రాక్‌ క్రాసింగ్‌పై అవగాహన.. ప్రతి నెలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్న అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: రైల్వే ట్రాక్‌ క్రాసింగ్‌ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, రైల్వే స్టేషన్లలో అతిక్రమణలపై రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది అవగాహన ప్రచారం నిర్వహించారు. బుధవారం విజయవాడ డివిజన్‌ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ప్లాట్‌ఫారమ్‌లను సులభంగా చేరుకోవడానికి ట్రాక్‌లో నడవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, ఇతర సూచనలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ వల్లేశ్వర. బి తోకల మాట్లాడుతూ ప్రయాణికులు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ఉపయోగించాలని, ట్రాక్‌ క్రాసింగ్‌లు, అతిక్రమణలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి కార్యక్రమాలను ప్రతి నెలా నిర్వహిస్తామని, అలాగే అవగాహన, భద్రతా ర్యాలీలు చేపడతామని వివరరించారు. డివిజన్‌ వ్యాప్తంగా అతిక్రమణలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిని అదనంగా మోహరిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రాంగణంలో అతిక్రమణలకు సంబంధించి ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ. వెయ్యి జరిమానా విధించడం జరుగుతుందని, ఈ ఏడాది ఇప్పటి వరకు 183 కేసులు నమోదు చేసి, రూ. 49,800 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement