బీఎస్‌పీ, ఎంఐఎంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రెండు పార్టీలే కలిసి బీజేపీని నాలుగు రాష్ట్రాల్లో గెలిపించాయని చురకలు అంటించారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి పద్మవిభూషణ్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి భారతరత్న ఇవ్వాలంటూ ఛలోక్తులు విసిరారు. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్‌లో బీజేపీ విజయం కోసం బహుజన్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎంలు ఎంతో శ్రమించాయని రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోవా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పనితీరు ఎంతో బాగుందని కొనియాడారు.
బీజేపీ గొప్ప విజయం సాధించిందన్న రౌత్, యూపీలో అఖిలేష్ యాదవ్ సీట్లు మూడు రెట్లు పెరిగాయని, 2 నుంచి 125కి పైగా స్థానాలు వచ్చాయని, ఇరువురు బీజేపీ విజయానికి దోహదపడ్డారన్నారు. యూపీలో మొత్తం 403 స్థానాల్లో బీఎస్‌పీకి ఒక స్థానం దక్కగా.. ఏఐఎంఐఎంకు ఒక స్థానం కూడా దక్కలేదు. అక్కడ ఓట్లు చీల్చడానికి మాత్రమే ఆ పార్టీ పనికి వచ్చిందని సంజయ్ రౌత్ విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..