ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – భారత ప్రభుత్వం తొట్టతొలిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాన్నిఅందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగుళూరు ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్‌ను విజ్ఞాన రత్న అవార్డుతో సత్కరించారు. రాష్ట్రపతిభవన్‌లో ఉన్న గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ పురస్కారాన్ని ఇవాళ అందజేశారు. 13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, 18 విజ్ఞాన్ యువ -శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌లు, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డును కూడా రాష్ట్రపతి అందజేశారు. చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది. ప్రాజెక్టు డైరెక్టర్ పీ వీరముత్తువేల్ ఆ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతలందరికీ ఓ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు.
Awards – రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement