ఆసియా – పసిఫిక్ ప్రాంతాలో15-25 మిలియన్ ప్యాసింజర్స్ విభాగంలో బెస్ట్ ఎయిర్‌పోర్టు బై సైజ్ అండ్ రీజియన్‌గా ఎంపికైంది. ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణిల సంతృప్తి, వారికి అందించే సర్వీసులను పరిగణలోకి తీసుకుని ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డును అందించారు. ఒకటి కాదు రెండు కాదు తొమ్మిదేళ్లుగా అవార్డులు వస్తూనే ఉన్నాయి. 2009సంవత్సరం నుంచి 2017 సంవత్సరం వరకు అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఎంపీపీఎ విభాగంలో 2018లో ప్రపంచ నంబర్ 4వ స్థానంలో శంషాబాద్ విమానాశ్రయం నిలిచింది. 2019-2020లో ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో 15-25 ఎంపీపీఎ విభాగంలో బెస్ట్ ఎయిర్‌పోర్టు బై సైజ్ అండ్ రీజియన్ అవార్డులను సొంతం చేసుకుంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి వారి అవసరాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నందుకు వాయిస్ ఆఫ్ కస్టమర్‌గా గుర్తింపు పొందింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. వరుసగా అవార్డులు దక్కడం పట్ల సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..