హైదరాబాద్ : ఏ సమాజమైనా ఎదగాలన్నా… మారాలన్నా… ఏ సమాజమైనా తనకు తాను నిలబడాలన్నా సాహిత్యం, సంస్కతి అవసరమని ఇవి లేకుండా మానవ మనుగడ లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన ఆచార్య ఆర్.లింబాద్రి అన్నారు. ఆ క్రమంలో తెలుగు సాహిత్యాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదని ఆయన అన్నారు. తెలంగాణ సమాజంలో సాహిత్యమంటే చాలా ఇష్టమని, ఇక్కడి ప్రభుత్వం కూడా సాహిత్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం గురువారం వర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్యకవితా ప్రక్రియలో డా.ఎం.పురుషోత్తమాచార్య ‘రహస్యభూతము’, వచన కవితా ప్రక్రియలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు (కష్ణుడు) ‘‘ఆకాశం కోల్పోయిన పక్షి’’, బాలసాహిత్యంలో ఎం.కష్ణకుమారి ‘ఈ అడమి మాది’ కథానికా ప్రక్రియలో డా.సిద్దెంకి యాదగిరి ‘తప్ష’కు రూ.20116ల నగదు పారితోషికంతో పాటు సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లింబాద్రి పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు. విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ యోగ్యత గల సాహితీవేత్తలను శోధించి వారికి సముచిత రీతిలో సత్కరించడంతో సాహిత్యలోకం ఎంతో హర్షిస్తుందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ ఆచార్య కిషన్‌రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య సేవకు అంకితమైన నిరాడంబర రచయితలకు 2019 సాహితీ పురస్కారాలను అందించడాన్ని విశ్వవిద్యాలయం గర్వపడుతుందని అన్నారు. విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం 20కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వచ్చే రెండు మాసాల్లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని బాచుపల్లి ప్రాంగణానికి తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రజ్యోతి అసోసియేటెడ్ ఎడిటర్ ఎ.కష్ణారావు మాట్లాడుతూ భారతీయ విలువల్లో ప్రశ్నకు, జిజ్ఞాసకూ ప్రాధాన్యం ఉన్నదని అన్నారు. కానీ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఒక జర్నలిస్టు కవి అయితే వార్తల్లో వ్యక్తం చేయలేని భావాలను కవిత్వంగా రాసుకుంటారని అన్నారు. సమాజంలోని వ్యత్యాసాన్ని, అసమానతల్ని చూడలేని వాడు కవి కాడని అన్నారు. మన సాహిత్యం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. కవిత్వమంటే చెట్ల ఆకులు రాల్చిన కన్నీళ్లు ఒక అమరుడి మీద ఎలా పడిందో గమనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా జెనటియూ వీసీ డా.కట్టా నర్సింహారెడ్డి, కాకతీయ వర్సిటీ పూర్వ వీసీ సాయన్న, తెలుగు వర్సిటీ రిజిసా్ట్రర్ ఆచార్య భట్టు రమేష్, రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.