శ్రీరాంపూర్, (ప్రభ న్యూస్) : జమ్ము కాశ్మీర్ లో సీటు సాధించిన కోడం వర్షిని శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి గురువారం తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ వర్షిని ఐఐఎంలో క్యాట్ లో చూపిన ప్రతిభా ఆధారంగా సీటు సాధించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ఉన్నత లక్ష్యాలతో చదువులు కొనసాగించే వర్షిని లాంటి విద్యార్థినీలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు చదువులు కొనసాగించాలని సూచించారు.
ఐఐఎంలో కూడా వర్షిని మంచి ప్రతిభా కనబరిచి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, డివైపిఎం లు రాజేశ్వరరావు, రాజేష్, దేవేందర్ రెడ్డి, సీనియర్ పిఓ కాంతారావు ఐటి ప్రోగ్రామర్ శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.