Tuesday, November 26, 2024

సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 37, 38 స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవం కార్య‌క్ర‌మంలో వర్శిటీ ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌, వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ… ఈ విశ్వవిద్యాలయంలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న యూనివర్శిటీ నుంచే గౌరవ డాక్టరేట్‌ పొందడం అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నానన్నారు. ఇక్కడి క్యాంటీన్‌ తమ అడ్డా అని, ఇక్కడ కూర్చుని ఎన్నో విషయాలపై చర్చించేవారమన్నారు. అలాంటి చర్చలు ఇప్పుడు జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమస్యలపై యువత స్పందించాలని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా తయారుకావాలని సూచించారు. గత 40 ఏండ్లుగా నాగార్జున విశ్వవిద్యాలయం విద్యా రంగానికి అందిస్తున్న సేవలు అమోఘమైనవని ప్రశంసించారు. హోలిస్టిక్‌ విద్యా విధానం అమలవుతేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement