Monday, November 18, 2024

ఇన్ఫీ ప్రాజెక్టుపై ఆస్ట్రేలియా ప్రభుత్వం రివ్యూ

ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన 135 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్టు విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహించనున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు ఇచ్చే క్రమంలో, దీనిగురించి అధికారపార్టీ ఎంపీ సువార్ట్‌ రాబర్ట్‌ ఇన్ఫీతోపాటు, సినర్జీ 360కి లీక్‌చేశారు. దీంతో ప్రభుత్వ కాంట్రాక్టును ఇన్ఫీ సొంతం చేసుకోవడం సులువైందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా మీడియా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఎంపీ తన అధికారంతో ప్రయివేటు వ్యక్తుల్ని, సంస్థల్ని ప్రభావితం చేస్తూ, వారికి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విషయాన్ని రివ్యూ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement