ఒలింపిక్స్ అథ్లెట్లకి కండోమ్ లు ఉచితంగా సరఫరా చేయడం సాధారణ విషయమే. శృంగారం సురక్షితం చేయాలన్న ఉద్దేశంతో ఒలింపిక్స్, కామన్ వెల్త్ లాంటి మెగా ఈవెంట్లలో కండోమ్లను ఫ్రీగా ఇస్తారు. అయితే కండోమ్ తన సొంత ప్రయోగానికి వాడిన ఓ అథ్లెట్ ఓ మెడల్ కొట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన స్లాలోమ్ కనోయిస్ట్.. జెస్సికా ఫాక్స్ కండోమ్‌తో చేసిన ప్రయోగం ఆమెకు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, క్యాంస్య పతకం వచ్చేలా చేసింది.
జెస్సికా మాత్రం కండోమ్‌ను తన కయాక్ (చిన్న పడవ)ను రిపేర్ చేయడానికి కండోమ్‌ను ఉపయోగించింది. తన కయాక్‌కు చివరలో ఒక చిన్న రంద్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో ఒక కార్బన్ మిశ్రమాన్ని పెట్టి దానిపై కండోమ్‌తో పూడ్చివేసింది. ఆ తర్వాత ఇదే కయాక్‌ను ఉపయోగించి బరిలోకి దిగిన జెస్సికా వుమెన్స్ సీ1 కానో సాలోమ్‌లో స్వర్ణం.. కానో సాలోమ్ కె1 ఫైనల్‌లో క్యాంస్యం గెలుచుకుంది. అలా కండోమ్‌ను తన కయాక్‌కు ఉపయోగించిన జెస్సికా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. కయాక్‌కు కండోమ్‌ను ఉపయోగించిన విధానానికి సంబంధించిన వీడియోనూ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఒలింపిక్స్ కోసం వచ్చే అథ్లెట్లకు నిర్వాహకులు కండోమ్‌లు అందజేయడం షరామామూలే. అయితే ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో నిర్వాహకులు ఇలాంటి ఆలోచన ఏమీ చేయరనే అంతా అనుకున్నారంతా. కానీ ఈసారి కూడా అథ్లెట్లకు నిర్వాహకుల నుంచి కండోమ్‌లు అందాయి. కాకపోతే క్రీడా గ్రామంలో వాటిని క్రీడాకారులు ఉపయోగించొద్దని, వాటిని జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లాలని నిర్వాహకులు కండిషన్ పెట్టారు.
ఇది కూడా చదవండి :