అహ్మదాబాద్: భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నాహాలు మొదలు పెట్టింది. రవి చంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవడం కోసం అచ్చం అతనిలా ఆఫ్ స్పిన్ వేసే భారత స్పిన్నర్ మహేష్ పిథియాను తీసుకుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న మొదలు కానుంది. భారత పర్యటనలో గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా జట్టు సన్నాహాలు మొదలు పెట్టింది. టీమిండియా సీనియర్ స్పిన్న్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవడం కోసం కొత్త ఎత్తుగడ వేసింది. నెట్ ప్రాక్టీస్ కోసం అచ్చం అతనిలా ఆఫ్ స్పిన్ వేసే భారత స్పిన్నర్‌ను తీసుకుంది. ఇంతకు అతను ఎవరంటే మహేష్ పిథియా. 21 ఏళ్ల ఈ స్పిన్నర్ పోయిన ఏడాది డిసెంబర్లో బరోడా తరపు న ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరగ్రేటం చేశాడు. సోషల్ మీడి యా వీడియో ద్వారా ఇతను ఆసిస్ జట్టు సహాయక సిబ్బంది వెంటనే అతడిని సంప్రదిం చారు.
ఆసిస్ బ్యాటర్లు నెట్స్‌లో అతని బౌలింగ్‌ను ఎదుర్కొంటూ అశ్విన్‌ను అడ్డుకోవ డం కోసం కసరత్తులు చేసు న్నారు. ఆ జట్టు స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మహేష్ బౌలింగ్‌లో షాట్లు ఆడుతున్న వీడి యో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండేళ్ల క్రితం సొంత గడ్డపై టీమిండియా చేతిలో ఆసిస్ టెస్ట్ సిరీస్ కోల్పోయింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ విధ్వం సక బ్యాటింగ్‌తో భారత్ టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. 2020లోనూ ఇండియాకు వచ్చిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలవ లేదు. అశ్విన్ బౌలింగ్‌లో ఆడేందుకు ఆసిస్ బ్యాటర్లు తిప్పలు పడ్డారు. 4 మ్యాచు ల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ 14 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొ ట్టారు. దాంతో ఈసారి అశ్విన్‌ను ధాటిగా ఎదుర్కోవా లని ప్యాట్ కమిన్స్ బృందం భావిస్తోంది. అంతే కాదు ఇండియాను స్వదేశంలో ఓడించాలని కసితో ఉంది.
9 నుంచి తొలి టెస్ట్
భారత పర్యటనలో ఆసిస్ నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న మొదలు కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఈ సిరీస్ విజయం చాలా ముఖ్యం. ఇప్ప టికే ఆసి స్ 75.56 పాయింట్లతో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇండి యా 58.93 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఐసీసీ 2021లో తొలిసారి నిర్వహిం చిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమి పాలైంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 యొక్క నాల్గవ, చివరి టెస్ట్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరవుతారు. ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్‌లను చూస్తారు. అహ్మదాబాద్ లోని సుందరమైన నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియానికి అతని పేరు పెట్టిన తర్వాత ప్రధాని మోడీ హజరయ్యే మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం