Sunday, September 8, 2024

T20 | టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. ఫస్ట్ బ్యాటింగ్ చేయ‌నున్న టీమిండియా

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది భారత్. కాగా, ఇవ్వాల‌ (ఆదివారం) కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికాగా రెండో T20 మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా… ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

విశాఖలో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వచ్చిన ఆస్ట్రేలియా, ఇవ్వాల జరిగేలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. ఇక సిరీస్‌లో రెండవ మ్యాచ్‌లోనూ నెగ్గాలని భారత్‌ భావిస్తోంది. మొన్నటి మ్యాచ్‌లో హీరోలుగా నిలిచిన సూర్యకుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement