Saturday, November 23, 2024

మహిళల వన్డే ప్రపంచ కప్‌ జగజ్జేత ఆస్ట్రేలియా.. అలీస్సా విధ్వంసకర ఇన్నింగ్స్‌

న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌ టోర్నీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియ జట్టు రెచ్చిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. కొత్త రికార్డులను నెలకొల్పింది. క్రైస్ట్‌చర్చ్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 71 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ను నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్స్‌లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఓపెనర్‌ అలీస్సా హీలీ సెంచరీ బాదింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఆమె ట్రిపుల్‌ డిజిట్‌ ఫిగర్‌ను అందుకోవడం వరుసగా రెండో సారి. సెమీ ఫైనల్‌లోనూ సెంచరీ బాదింది. 138 బంతుల్లో 170 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన హీలీ.. క్రీజులో పాతుకుపోయింది. 45 ఓవర్‌లో వెనుదిరిగింది. ష్రుబ్‌సోల్‌ వేసి ఆ ఓవర్‌ మూడో బంతికి స్టంపౌట్‌గా ఔటయ్యింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసిన హీలీ.. తరువాత 38 బంతుల్లో ఏకంగా 70 పరుగులు చేసింది. 26 ఫోర్లు నమోదయ్యాయి. చివరి ఓవర్‌లో వరుస ఫోర్లతో విరుచుకుపడింది. మరో ఓపెనర్‌ రాఛెల్‌ హేన్స్‌ 93 బంతుల్లో ఏడు ఫోర్లతో 68, వన్‌ డౌన్‌లో వచ్చిన బెత్‌ మూనీ 47 బంతుల్లో 62 రన్స్‌, డెత్‌ ఓవర్స్‌లో వచ్చిన ఎల్లిdస్‌ 10 బంతుల్లో 17 రన్స్‌ చేసింది. దీంతో 50 ఓవర్స్‌లో 356 రన్స్‌ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ముందు ఉంచింది. ఇంగ్లండ్‌ బౌలర్లు ష్రుబ్‌సోల్‌ 3, సోఫీ ఒక వికెట్‌ తీసుకుంది.

గట్టి పోటీ ఇచ్చిన ఇంగ్లండ్‌..

ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌ కూడా గట్టి పోటీ ఇచ్చింది. 43.4 ఓవర్స్‌లో 285 రన్స్‌ చేసింది. ఓపెనర్లు టామీ 26 బంతుల్లో 5 ఫోర్లతో 27 రన్స్‌, హీథర్‌ నైట్‌ 25 బంతుల్లో 4 ఫోర్స్‌తో 26, అమీ జోన్స్‌ 18 బంతుల్లో 2 ఫోర్స్‌తో 20, సోఫియా 22 పరుగులు చేసింది. మిడిల్‌ ఆర్డర్‌లో నాట్‌ స్కైవర్‌ బ్యాటింగ్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హైలెట్‌. 121 బంతుల్లో 15 ఫోర్స్‌తో 148 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచింది. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో సహకారం అందించేవారు లేకపోవడంతో నిస్సాహాయంగా ఉండిపోయింది. అలానా, జెస్‌ మూడేసి వికెట్లు తీసుకున్నారు. మెగాన్‌కు 2, తహ్లియా, యాష్లేకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్రపంచ కప్‌ గెలుపొందడం ఇది ఏడోసారి. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీస్‌లో మళ్లిd విండీస్‌ను ఓడించింది ఆసీస్‌ జట్టు. ప్రపంచ కప్‌లో ఆసీస్‌ ప్లేయర్‌ ఎల్లిdస్‌ నాలుగు సార్లు ప్రతినిథ్యం వహించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ కప్‌ టోర్నీ అవార్డును హీలీ సొంతం చేసుకుంది. 505 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మిచెల్‌ స్టార్క్‌ భార్యే హీలీ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement