Tuesday, November 26, 2024

కరోనా ఎఫెక్ట్.. టాస్ వేసిన తర్వాత రద్దయిన వన్డే మ్యాచ్

క‌రోనా వైరస్ కార‌ణంగా పలు క్రీడలు రద్దవుతున్నాయి. మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈ జాబితాలో మరో క్రికెట్ మ్యాచ్ చేరింది. అయితే టాస్ పడిన తర్వాత ఈ మ్యాచ్ రద్దు కావడం గమనార్హం. వెస్టిండీస్ టీమ్ సిబ్బందిలోని ఒకరికి కరోనా సోకడంతో సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గాల్సిన రెండో వ‌న్డే మ్యాచ్‌ను వాయిదా వేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కరోనా నేపథ్యంలో విండీస్, ఆసీస్ జట్లలోని ఆటగాళ్లందరికీ మ‌రోసారి కరోనా టెస్టులు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ మ్యాచ్ మ‌ళ్లీ ఎప్పుడు నిర్వ‌హిస్తారో త‌ర్వాత ప్ర‌క‌టిస్తామని అధికారులు తెలిపారు. బ‌యో బ‌బుల్‌లో ఉన్న వాళ్లంద‌రినీ ఐసోలేష‌న్‌లో ఉంచ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. శుక్ర‌వారం ఆటగాళ్లకు నిర్వ‌హించిన కరోనా టెస్టుల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఆ త‌ర్వాతే మిగ‌తా రెండు వ‌న్డేల‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ఈ వార్త కూడా చదవండి: నేడు భారత్-శ్రీలంక చివరి వన్డే

Advertisement

తాజా వార్తలు

Advertisement