Friday, November 22, 2024

భారత విమానాలపై మే 15 వరకు నిషేధం: ఆస్ట్రేలియా

ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌ను నిషేధించిన జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది. దేశంలో క‌రోనా కేసులు భారీ పెరిగిపోతుండ‌టంతో ఆందోళ‌న చెందుతున్న ఇత‌ర దేశాలు ఇండియా నుంచి ప్ర‌యాణికుల‌ను త‌మ దేశాల్లోకి అనుమ‌తించ‌డం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మే 15వ తేదీ వ‌ర‌కూ ఇండియా నుంచి నేరుగా వ‌చ్చే ప్ర‌యాణికుల విమానాల‌పై తాత్కాలిక నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది..ప్రస్తుతం వేలాది మంది ఆస్ట్రేలియన్లు, ప్రముఖ క్రికెటర్లు భారత్ లోనే ఉన్నారని, వాళ్లందరికీ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, అత్యంత అవసరం ఉన్నవారిని మాత్రం ప్రత్యేక విమానాల్లో ఆస్ట్రేలియాకు తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. భారత్ కు అవసరమైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆక్సిజన్ ట్యాంకులు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు సరఫరా చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement