భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏండ్ల బోపన్న.. తన కెరీర్లో తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను తన పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్తో కలిసి కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో ఇటలీకి చెందిన సిమోన్ బోలెల్లి , ఆండ్రియా వాస్సోరిపై 7-6, 7-5 వరుస సెట్లలో విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్ స్లామ్ గెలిచిన పెద్ద వయస్కుడిగా బోపన్న చరిత్ర సృష్టించారు. భారత్ తరఫున మెన్స్ డబుల్స్ విభాగంలో 2012లో లియాండర్ పేస్ తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా బోపన్న రికార్డులకెక్కాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement