వచ్చే నాలుగేళ్ల కాలంలో.. భారత్ 10 లక్షల ఉద్యోగాలను, వివిధ పరిశ్రమల రంగాల్లో అనేక కొత్త అవకాశాలను చూస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం.. ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని యోగా శిక్షకులు, చెఫ్‌లతో సహా వివిధ వృత్తులు కొత్త అవకాశాలను చూస్తాయన్నారు. రాబోయే నాలుగు – ఐదేళ్లలో భారతదేశంలో ఒక మిలియన్ ఉద్యోగాలు సృష్టిస్తున్నామని చెప్పకొచ్చారు. భారత్-ఆస్ట్రేలియా దేశాలు శనివారం ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో భారత్‌కు వాణిజ్యపరంగా కీలకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
కొన్ని వస్తులకు జీరో ట్యాక్స్..
ప్రస్తుత ఒప్పందంతో కాన్‌బెర్రా.. వస్త్రాలు, తోలు, ఆభరణాలు, క్రీడా ఉత్పత్తుల వంటి 95 శాతానికి పైగా భారతీయ వస్తువులను తన మార్కెట్‌లో సుంకం రహిత యాక్సెస్‌ను అందిస్తుంది. భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాన్ని పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటకం-పెట్టుబడి శాఖల మంత్రి డాన్ టెహన్ వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా అధినేత స్కాట్ మారిసన్ సమక్షంలో కుదుర్చుకున్నారు. భారతదేశం-ఆస్ట్రేలియా సంబంధాలకు ఇది నిజంగా జలపాతం లాంటిదని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఈ ఒప్పందం భారత్‌తో ఆస్ట్రేలియా సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోరిసన్ అభిప్రాయపడ్డారు.
ఒప్పందంలోకి కీలక అంశాలు..
- వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 27 బిలియన్ డాలర్ల నుంచి 45-50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని గోయల్ తెలిపారు.
- ఆస్ట్రేలియా మొదటి రోజు నుంచి దాదాపు 96.4 శాతం ఎగుమతులకు (విలువ ఆధారంగా) భారత్‌కు జీరో డ్యూటీ యాక్సెస్‌ను అందిస్తోంది. ఇది ఆస్ట్రేలియాలో 4-5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఆకర్శిస్తున్న అనేక ఉత్పత్తులను కవర్ చేస్తుంది.
- లేబర్ ఇంటెన్సివ్ రంగాలలో టెక్స్‌టైల్, దుస్తులు, కొన్ని వ్యవసాయ, చేపల ఉత్పత్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నీచర్, ఎలక్ట్రిక్ వస్తువులు, రైల్వే వ్యాగన్లు ఉన్నాయి.
- ఆస్ట్రేలియా భారత్‌కు 17వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. న్యూఢిల్లిd కాన్‌బెర్రాకు 9వ అతిపెద్ద భాగస్వామి. వస్తువులు, సేవలలో ద్వైపాక్షిక వాణిజ్యం 2021లో 27.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
- భారతదేశ వస్తువుల ఎగుమతుల విలువ 6.9 బిలియన్ డాలర్లు, దిగుమతులు 2021లో 15.1 బిలియన్ డాలర్లకు చేరాయి.
- పెట్రోలియం ఉత్పత్తులు, వస్త్రాలు, దుస్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, తోలు, రసాయనాలు, రత్నాలు, ఆభరణాలు ఆస్ట్రేలియాకు భారత్ చేసే ప్రధాన ఎగుమతుల్లో ఉన్నాయి.
- దిగుమతుల్లో ప్రధానంగా ముడి పదార్థాలు, బొగ్గు, ఖనిజాలు, ఇంటర్మీడియెట్ వస్తువులు ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..