Wednesday, October 9, 2024

T20 WC | ఆసీస్ అదుర్స్… న్యూజిలాండ్ పై ఘ‌న విజ‌యం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు అద్బుత విజ‌యం సాధించింది. గ్రూప్-ఏలో పోటీ ప‌డుతున్న ఆస్ట్రేలియా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తో త‌ల‌ప‌డ‌గా… 60 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 148/8 పరుగులు చేసింది. టాపార్డ్ లో కెప్టెన్ అలిస్సా హీలీ (26), బెత్ మూనీ (40), ఎల్లీస్ పెర్రీ (30) దంచికొట్టడంతో ఆసీస్ స్కోరు భారీగా నమోదైంది.

ఇక‌ 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కనీసం 100 పరుగులు కూడా చేయలేక 88 పరుగులకే ఆలౌటైంది. అమేలియా కెర్ 29 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, అనాబెల్ సదర్లాండ్ మూడు వికెట్లు తీయగా… సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు, జార్జియా వేర్‌హామ్, తహ్లియా మెక్‌గ్రాత్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు భారీ విజ‌యం ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement