వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో తమ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది ఆసీస్. ఇక, ఈ మెగాటోర్నీలో మరో రెండు మ్యాచులు (ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లతో) ఆడనుంది ఆస్ట్రేలియా జట్టు.. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచుల్లో విజయం సాధించినా కూడా ఆస్ట్రేలియా సెమీస్ బెర్తు ఖాయం కానుంది.
కాగా, ఇవ్వాల్టి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తక్కువ ఇంగ్లండ్ ముందు 287 పరుగుల టార్గెట్ ని సెట్ చేసింది. ఇక ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో లక్షాన్ని చేరుకోలేకపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ (64), డేవిడ్ మలన్ (50) హాఫ్ సెంచరీలు చేశారు. మొయిన్ అలీ (42) పరుగులతో రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. స్టోయినిస్ ఓ వికెట్ సాధించాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (71) హాఫ్ సెంచరీ చేశాడు. స్టీవ్ స్మిత్ (44), కామెరూన్ గ్రీన్ (47), మార్కస్ స్టోయినిస్ (35) ఆఖరిలో ఆడమ్ జంపా (29) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లు చెరో రెండు వికెట్లు తీశారు. డేవిడ్ విల్లీ, లివింగ్ స్టోన్ లు ఒక్కొ వికెట్ సాధించారు.