వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ సిరీస్ రెండు జట్లకు కీలకం. ఇందుకోసం ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మార్నస్ లాబుస్‌చాగ్నే జట్టులోకి వచ్చాడు. జట్టులో పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ కూడా ఉన్నారు. కామెరాన్ గ్రీన్ కూడా ఫిట్‌గా ఉండడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు..
ట్రావిస్ హెడ్ ఔట్
ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా చేతికి గాయమైంది. చేయి ఫ్రాక్చర్ అయినందున ప్రపంచకప్‌లో ఆడటం కూడా కష్టమే. అతని స్థానంలో మార్నస్ లాబుస్చెన్‌కు జట్టులో అవకాశం లభించింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్
సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 24న ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరగనుంది. మూడో మ్యాచ్ సెప్టెంబర్ 27న సౌరాష్ట్రలో జరగనుంది.
అయితే, ఈ ఏడాది మార్చి నెలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1తో టీమిండియాను ఓడించింది. ఈ ఓటమిని విమోచుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరగనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది.
వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ, షాన్ ఎబ్, నాథ్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంగ్హా , మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.