Wednesday, December 18, 2024

Ausis vs India – టెయిల్ ఎండ‌ర్స్ వీరోచిత పోరు … ఫాల్ ఆన్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ భార‌త్

జడేజా, అక్ష‌ర దీప్ బ్యాటింగ్ ప్ర‌తిభ
శ‌త‌కం చేజార్చుకున్న కె ఎల్ రాహుల్
అయినా ఆసీస్ దే పై చేయి
మ్యాచ్ కు రేపే చివ‌రి రోజు..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ‘ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది.. టెయిలెండర్లు జస్ ప్రీత్ బుమ్రా (10), ఆకాశ్ దీప్ (27) పదో వికెట్కు 39 పరుగులు జోడించారు. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపేశారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా స్టేడియంలో మూడో టెస్టు నాలుగో రోజు ఆట పూర్తియింది. 4వ రోజు ముగిసే సరికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 252 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా 10, ఆకాశ్ దీప్ 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. . తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఇంకా 193 పరుగులు వెనుకంజలో ఉంది .

అంతకుముందు కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. యశస్వి జైస్వాల్ (4), శుభ్ర్మన్ గిల్ (1), విరాట్ కోహ్లి (3), రిషబ్ పంత్ (9), సిరాజ్ (1) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. రోహిత్ శర్మ 10, నితీశ్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ 4, మిచెల్ స్టార్క్ 3.. జోష్ హేజిల్ వుడ్, నాథన్ లైయన్ చెరో వికెట్
తీశారు.

భార‌త్ బ్యాటింగ్ లో ..

- Advertisement -

77 పరుగుల వద్ద రవీంద్ర జడేజా ఔటయ్యాడు. అతను పాట్ కమిన్స్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ చేతికి చిక్కాడు. నితీష్ రెడ్డి (16 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ (10 పరుగులు)లను కూడా అవుట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ (1 పరుగు)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. కేఎల్ రాహుల్ (84 పరుగులు) నాథన్ లియాన్‌కు బలయ్యాడు.

కాగా, భారత జట్టు 51/4 స్కోరుతో ఉదయం ఆట ప్రారంభించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రమే టీమ్ ఇండియా గౌరవాన్ని కాపాడారు. రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 139 బంతుల్లో 84 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 123 బంతుల్లో 77 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ 115 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా టీమిండియా స్కోరును 200 దాటించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన అకాశ్ దీప్ ఆసీస్ పేస్ ఎదుర్కొని ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.. 27 ప‌రుగుల‌తో అకాష్ దీప్ నాటౌట్ గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement