ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవ్వాల (శనివారం) ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య జరిగాన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఈ రసవత్తర పోరులో కివీస్ ని 383 పరుగుల వద్ద కట్టడి చేసి 5 పరగుల తేడాతో గెలుపొందింది. పాయింట్స్ టేబుల్ లో టాప్ 4వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో న్యూజిలాండ్ ను ఓడించి తమ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (116) శతకంతో రాణించాడు. డారిల్ మిచెల్ (54), జేమ్స్ నీషమ్ (58) హాఫ్ సెంచరీలతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ , హేజిల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్ ఓ వికెట్ సాధించాడు.
ఇక, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్‌లు దంచి కొట్టారు.. ఓపెనర్‌లు డేవిడ్ వార్నర్ (81), ట్రావిస్ హెడ్ (109) ఫోర్లు, సిక్సర్‌లతో న్యూజిలాండ్ ఫీల్డర్లను మైదానం అంతటా పరుగులు పెట్టించారు. ఇక, గ్లెన్ మాక్స్ వెల్ (41), ఇల్లింగ్స్ (38), కమ్మిన్స్ (37), మిట్చెల్ మార్ష్ (36) పరుగులతో ఆకట్టకున్నారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్ రెండు, మాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు.