Friday, September 20, 2024

IMD | ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

ఈ సంవత్సరం రుతుపవనాల సీజన్ రెండవ భాగమైన ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కూడా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కార‌ణంగా దేశ వ్యవసాయం, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టులో రుతుపవనాలు దీర్ఘకాలిక సగటులో 94-106% వరకు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

వర్షాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు..

ఆగస్టులో చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని తూర్పు కోస్తా ప్రాంతాలతో పాటు ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 2024 జూలైలో దేశంలో 1901 తర్వాత ఎన్నడూ లేనంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాలు శతాబ్దం క్రితం నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టాయని ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement