ఆధునిక యుగంలో ఎన్ని మోడ్రన్ డ్రెసులు వేసిన రాని లుక్.. ఒక్క చీరకట్టుతో వస్తుందంటే అవుననే అంటున్నారు నేటి యువుతులు. పండుగులకు, ఏదైనా ఇంట్లో స్పెషల్ ఈవెంట్లకు చీరలు కట్టేందుకే మహిళలు ఇష్టపడతారు. చీర కట్టులో నటి శ్రీదేవి అందాన్ని వర్ణించలేం. ఆమె చీరకట్టుతో దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానుల మనసు గెలుచుకున్న శ్రీదేవి.. ఇంగ్లిష్ వింగ్లిష్ లో చీరకట్టును ఓసారి గుర్తు చేసుకోండి. 1997లో నటనకు విరామం చెప్పి.. తిరిగి 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ తోనే శ్రీదేవి అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల వేడుకను నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement