లండన్: మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని లండన్‌లో వేలం వేశారు. ఆ ఆక్షన్‌లో టిప్పు సుల్తాన్ ఖడ్గం సుమారు రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్‌హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు బాన్‌హమ్స్ తెలిపింది. 18వ శతాబ్ధంలో ఎన్నో యుద్ధాలను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. టైగర్ ఆఫ్ మైసూర్ గా సుప్రసిద్ధుడైన టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించి రక్షించుకున్నాడు. టిప్పు సుల్తాన్ మృతి తర్వాత అప్పటి బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బయిర్డ్ ఈ ఖడ్గం చేజిక్కించుకుని లండన్ తరలించాడు.. తాజాగా ఈ ఖడ్డాన్ని ఓ పారిశ్రామికవేత్త రూ 140 కోట్లకు కొనుగోలు చేశాడు..
Advertisement
తాజా వార్తలు
Advertisement