ఎప్పుడూ సాదా సీదాగా కనిపించే దర్శకుడు రాజమౌళి.. సూటు బూటులో దర్శనమిచ్చాడు. స్టార్ డైరెక్టర్ ఓ అరుదైన ఆహ్వానం అందుకున్నాడు. లాస్ ఏంజెల్స్ లో 13వ వార్షిక గవర్నర్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. స్టైలిష్ బ్లాక్ సూట్లో ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. రాజమౌళితో పాటు కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా సేమ్ సూట్లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.ఈ ఈవెంట్ సందర్భంగా బ్యూటీఫుల్ లొకేషన్లో తండ్రీకొడుకులిద్దరూ కెమెరాకు ఫోజులివ్వగా.. ఈ ఫొటోలను కార్తికేయ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.వచ్చే ఏడాది మహేశ్‌బాబుతో చేయబోతున్న సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement