- భౌతిక దాడులతో భయపెట్టలేరు..
- కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్టు చేయాలి
భువనగిరిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాడి అని ఆమె ఆరోపించారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్ కీ దుకాన్ అనేది బూటకమని… కాంగ్రెస్ ద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టే దుఖాన్ అని అన్నారు.
కాంగ్రెస్ డీఎన్ఏలో ద్వేషం ఉందని.. రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ యువజన విభాగం కూడా రౌడీలు, గూండాల విభాగంగా మారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేవని అన్నారు.