Sunday, November 3, 2024

ఉక్రెయిన్‌ ఆస్పత్రులపై దాడులు.. డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

ఉక్రెయిన్‌లో నెలకొన్న హెల్త్‌ ఎమర్జెన్సీపై.. ప్రపంచ వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా బలగాలు.. ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆరోపించింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నదని వివరించింది. నీరు, ఆహారం లేక నీరసించిపోతున్నారని, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ అని తెలిపింది. కాలుష్యం పెరిగిపోవడంతో.. శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని, మరియుపోల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. స్వచ్ఛమైన నీరు దొరక్కపోవడంతో.. కలరా వ్యాధి ప్రబలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తీవ్ర మానసిక ఒత్తిడి కూడా పెరుగుతున్నదని వివరించింది. గర్భిణులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు సరికాదని మండిపడింది.

శవాల దిబ్బగా మరియుపోల్‌..

మరియుపోల్‌ 90 శాతం ధ్వంసమైంది. చనిపోయిన వారి మృతదేహాలను తరలించే వారు లేకుండాపోయారు. దీంతో సామూహిక ఖననాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ప్రతీ రోజు మరియుపోల్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా.. ఫలితం శూన్యం. అటు ఉక్రెయిన్‌, ఇటు రష్యా దేశాలు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేవు. ఇరు వైపులా భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తూనే ఉన్నాయి. కీవ్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సైన్యం ఉంది. మరికొన్ని రోజుల్లో కీవ్‌ను హస్తగతం చేసుకునే దిశగా రష్యన్‌ ఆర్మీ అడుగులు వేస్తున్నది. రష్యా ఐదో సైనిక అధికారి ఉక్రెయిన్‌లో చనిపోయాడు. నల్ల సముద్రం నౌకాదళానికి చెందిన 810వ ప్రత్యేక గార్డ్‌ ్స మెరైన్‌ బ్రిగేడ్‌కు చెందిన కల్నల్‌ అలెక్సీ షరోవ్‌.. ఉక్రెయిన్‌ స్నైపర్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయాడని రష్యా అధికారులు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement