Friday, November 22, 2024

Delhi | కాంగ్రెస్ నేతలపై కక్షసాధింపులు.. ఈడీ కేసు విచారణపై అంజన్ కుమార్ యాదవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. బుధవారం నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం, ఈడీ తీరుపై విమర్శలు చేశారు. తాను ‘యంగ్ ఇండియన్’ సంస్థకు రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చానని, అయితే ఆ డబ్బు ఎక్కణ్ణుంచి వచ్చిందో చెప్పాలని ఈడీ అధికారులు ప్రశ్నించారని చెప్పారు.

- Advertisement -

తాను ఎంపీగా పనిచేశానని, ఇప్పటికీ పెన్షన్ కూడా వస్తోందని తెలిపారు. తాను చెల్లించిన రూ. 20 లక్షలకు పక్కా లెక్కలున్నాయని, రసీదు కూడా ఇచ్చారని వెల్లడించారు. గాంధీ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినవాళ్లను వదిలేస్తున్న దర్యాప్తు సంస్థలు, బడుగు బలహీన వర్గాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదని వెల్లడించారు.

ఈడీ అధికారులు మరికొన్ని వివరాలు అడిగారని, వాళ్లు అడిగిన వివరాలను, పత్రాలను మెయిల్ ద్వారా పంపిస్తానని అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మల్లయోధుల(రెజ్లర్లు)ను ఇబ్బంది పెడుతోందని, లైంగిక వేధింపుల బాధితులనే లక్ష్యంగా చేసుకుని అణచివేత చర్యలకు పాల్పడుతోందని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తానూ ఒక రెజ్లర్‌నేనని, సాటి రెజ్లర్ల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నానని అన్నార

Advertisement

తాజా వార్తలు

Advertisement