Tuesday, November 19, 2024

తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారుల దాడులు..

కొయంబత్తూర్‌ కారు బ్లాస్ట్‌ కేసులో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే గురువారం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. అర్ధరాత్రి నుంచి ఎన్‌ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 150 మంది అధికారుల బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అక్టోబర్ 23న కోయంబత్తూరులో కారులో ఎల్‌పీజీ సిలిండర్ పేలింది. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం సమీపంలో సంభవించిన పేలుడులో జమేజా ముబిన్ అనే 25 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ కారు పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను చెన్నైలోని పుజల్ జైలుకు తరలించారు. పేలుడుకు సంబంధించిన అనుమానితులు, మద్దతుదారుల ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement