వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో రిమాండ్ లో ఉన్నారు. కాగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోవైపు జైల్లో తోటి ఖైదీపై ఆయన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఒక విషయంపై ఇద్దరికీ మాటామాట పెరగడంతో ఆగ్రహంతో ఆయనపై చేయిచేసుకున్నట్టు చెపుతున్నారు. మరోవైపు అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు లభిస్తున్నట్టు సమాచారం. ఆయన ఒక్కరినే ఒక గదిలో ఉంచారని, పడుకునేందుకు పరుపు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆహారం కూడా బయట నుంచి అందుతున్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement