Thursday, January 16, 2025

Attack: సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. స్పందించిన ఎన్‌టీఆర్‌

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దుండగుడి దాడిపై జూనియ‌ర్ ఎన్‌టీఆర్ స్పందించారు. ఈ దాడి త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని తారక్ ట్వీట్ చేశారు. “సైఫ్ అలీ ఖాన్ సార్‌పై జ‌రిగిన దాడి గురించి విని షాక్‌కు గుర‌య్యా. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలి. ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నా” అని ఎన్‌టీఆర్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. అటు దేవ‌ర టీమ్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. “ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గుర‌య్యాం. త్వ‌ర‌గా కోలుకోండి సైఫ్ సార్” అని పేర్కొంది.

కాగా, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్‌ ఇంట్లోకి చొర‌బ‌డి కత్తితో ఆయనపై దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావ‌తీ ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌స్తుతం ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. కాగా, సైఫ్‌కు అయిన గాయాల్లో రెండు మ‌రీ లోతుగా ఉన్నాయ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ దాడి ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న బాలీవుడ్ వ‌ర్గాల‌ను ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement