పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఓ వ్యక్తి దాడిచేశాడు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం భక్తియార్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో సదరు వ్యక్తి దాడిచేశాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు. ఇది ముఖ్యమంత్రి భద్రత వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపింది. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు పేర్కొన్నారు. దాడి ఘటన సీసీ కెమేరాల్లో రికార్డయింది.
ఆ వ్యక్తి ముఖ్యమంత్రిపై వెనుక నుంచి దాడిచేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైెన భద్రత సిబ్బంది నిందితుడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కాగా సీఎం భద్రతపై జేడీయూ ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ దాడిచేసిన వ్యక్తి చేతిలో మారణాయుధం ఉండివుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిచింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...