కర్నాటక – తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాల జోరుగా సాగుతున్నాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా కోడి పందాలకు ప్లాన్ చేసి.. రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆర్గనైజర్లు కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఫామ్‌హౌస్‌లు, తోటలు మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి..
పటాన్ చెర్ మండల పరిధిలోని చిన్న కంజర్ల గ్రామ శివారు ప్రాంతంలోని ఓ పాం హౌస్ లో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పటాన్ చెరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల దాడి చేశారు. కోడి పందాల స్థావరంపై జరిపిన దాడుల్లో రూ.10 లక్షలు స్వాధీనం, 32 కోళ్లు, 26 వాహనాలను సీజ్ చేశారు. ఈ ఘటనలో కొందరిని అరెస్ట్ చేయగా.. పరారీలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నట్లు పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. గత కొంత కాలంగా చింతమనేని కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
నిందితుల విచారణలో కీలక సమాచారం..
అరెస్టైన వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు తెలిపారు. పరారైన మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి వెల్లడించారు. చింతమనేని కోసం మూడు పోలీసు బృందాల చే గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. చింతమనేని ఫోన్ చేస్తే వచ్చినట్టు నిందితుల వెల్లడించారని, చింతమనేని సెల్ సిగ్నల్స్ శంషాబాద్‌లో కట్ అయినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం ఆయన ఏపీలో లేరు అని డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు.