జూబ్లిహిల్స్‌లో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిపై అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బన్నీ ఇంటి గోడలు ఎక్కి రాళ్లు రువ్విన ఆరుగురు ఓయూ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా, దాడికి పాల్పడిన వారిలో కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్, బుద్దా ప్రేమ్ కుమార్ గౌడ్, ముక్క ప్రవీణ్ కుమార్, బైరు నాగరాజ్ గౌడ్, మరో ఇద్దరు నిందితులుగా పోలీసులు గుర్తించారు. నిందితులకు ఓయూ జేఏసీకి సంబంధాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.