Friday, November 22, 2024

Editorial: మహువాపై వేటు… విపక్షాలకు ఆయుధం

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకు న్నారన్న ఆరోపణపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మహూవా మొయిత్రాను సభనుంచి బహిష్క రించడాన్ని బీజేపీ, దాని మిత్రపక్షాలు సమర్థించగా, ప్రతిపక్షాలు సహజంగానే ప్రభుత్వంపై విరుచు కునిపడ్డాయి. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమెపై స్పీకర్‌ వేటు వేశారు.

ప్రశ్నలకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణపై 18 ఏళ్ళ క్రితం 11మంది ఎంపీలపై వేటు పడింది. వారిలో ఆరుగురు బీజేపీ ఎంపీలు, బీఎస్‌పీ ఎంపీలు ముగ్గురు, కాంగ్రెస్‌, ఆర్‌జేడీ ఎంపీలు చెరి ఒకరు ఉన్నారు. వీరు లంచం తీసుకుంటుండగా కోబ్రా పోస్టు అనే ఆన్‌లైన్‌ న్యూస్‌సైట్‌ ఫిలిం తీసింది. ఈ కేసులో కోబ్రా పోస్టు సంస్థకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై కూడా అప్పట్లో కేసు నమోదు అయింది.
తృణమూల్‌ ఎంపీ మహూవా మొయిత్రా పార్లమెం టులో ప్రశ్నలు అడిగేందుకు హీరా నందానీ నుంచి డబ్బు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాక, దుబాయ్‌ పర్యటన సందర్భంగా మన పార్లమెంటు లాగిన్‌ని యాక్సిస్‌ చేశారన్న ఆరోపణ కూడా ఆమెపై వచ్చింది. వీటిపై పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ చేత విచారణ జరిపించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చిన 500 పేజీల నివేదికను శుక్రవారం నాడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ సభలో ప్రవేశపెట్టగా, లోక్‌సభ ఆమోదించింది. దీనిపై తనను మాట్లాడనీయాలని మహువా కోరగా, స్పీకర్‌ అనుమతి నిరాకరించారు. 2005లో ఇలాంటి ఆరోపణలకు సంబంధించి ఎథిక్స్‌ కమిటీ నివేదికపై ఆరోపణలకు గురైన వారికి మాట్లాడే అవకాశం ఆనాటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ ఇవ్వలేదన్న విషయాన్ని స్పీకర్‌ బిర్లా గుర్తు చేశారు. దాం తొ మహూవా మరింతగా రెచ్చిపోయి, ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ, అందులో భాగంగానే తనపై నిరాధారమైన ఆరోపణలు చేయించి, తూతూ మంత్రంగా విచారణ జరిపించి వేటు వేశారని ఆరోపించారు. బహిష్కరణ అంశంపై చర్చ జర గాలనీ, సభలో తనను మాట్లాడనివ్వాలని ఆమె పట్టు పట్టారు. ప్రభుత్వంలోని లోపాలను తృణమూుల్‌ కాంగ్రెస్‌ ఎత్తి చూపుతున్నందుకే కక్ష పూరితంగా ఈ చర్య తీసుకున్నారని కూడా ఆమె ఆరోపించారు. తన బహిష్కరణను మహాభారతంలో వస్త్రాపహరణ ఘటనతో ఆమె పోల్చారు. కేం ద్రానికి పోయే కాలం వచ్చిందనీ, ప్రభు త్వంపై తమ పార్టీ దాడి ఆగదనీ, ఇకపై మహాభారత యుద్ధాన్ని చూస్తారని ఆమె హెచ్చరిం చారు. మహూవాపై బహిష్కరణ వేటును తృణమూల్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ ప్రభృతులు ఖండిం చారు. మహూవాకి ప్రతిపక్షాలు అండగా నిలబడటంతో మమత మరింత ఉధృతంగా ప్రభుత్వంపై దాడి జరి పారు. ఒక మహిళా ఎంపీని నిరాధారమైన ఆరోపణల ను పురస్కరించుకుని సభ నుంచి బహిష్కరిం చడం మోడీ ప్రభుత్వం మహిళలకిస్తున్న అగౌరవానికి నిద ర్శనమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై న్యాయ పోరాటం మాత్రమే కాకుండా ప్రజాక్షేత్రం లోనూ పోరాటం సాగిస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిం చాయి. మహిళలపట్ల మోడీ ప్రభుత్వానికి ఇసుమం తైనా గౌరవం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మహిళా బిల్లు విషయంలో కూడా మోడీ మహిళలను వంచిం చారనీ, పార్లమెంటు ఆమోదించిన రిజర్వేషన్లు మరో పదేళ్ళకుగాని అమలులోకి రావనీ, ఇది వంచనేన న్న ప్రతిపక్షాల ఆరోపణల నిరాధారం కాదు. మహూవా తృణమూల్‌ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ అడుగు జాడల్లో ధీరవనిత అని అనిపించుకోవడానికి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారు. బెంగాల్‌లో బీజేపీ నాయకుల పర్యటన సందర్భంగా ఆమె ప్రదర్శ నలను నిర్వహిస్తున్నారు. బీజేపీకి ఆమె కంట్లో నలుసు గా తయారయ్యారు. బహుశా ఈ కారణంగానే ఆమెపై కమలనాధులు వేటు వేయించి ఉంటారన్న అభిప్రా యాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మహూవాపై బహిష్కరణ వేటు ప్రభావం వచ్చే ఏడాది జరిగే పార్ల మెంటు ఎన్నికల్లో తప్పనిసరిగాఉంటుందని ప్రతి పక్షా లు భావిస్తున్నాయి. ఆమెపై వేటు వేయడం కఠినమైన శిక్షేననీ, మందలించి వదిలివేసి ఉంటే సబ బుగా ఉండేదని ఏ పార్టీకీ చెందని వారంటున్నారు. బీజేపీపై పోరాటానికి మంచి అస్త్రం దొరికిందని ప్రతిప క్షాలు సంబ రపడుతున్నాయి. వేటుతో ఆమె పట్ల ప్రజాద రణ పెరు గుతుందని ప్రతిపక్షాలు భావిస్తు న్నాయి. అయితే, మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకా రం నడుచు కుం టోందనీ, పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ నివేదికను గౌర వించాలని కమలనాథులు వాదిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement