కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ గత రాత్రి ప్రయాణిస్తున్న వాహనంపై జండా కర్రలతో దాడి చేశారు.. ఢిల్లీ పర్యటన నిమిత్తం తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండగా గవర్నర్ వాహనాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.. ఆయన వాహన శ్రేణిపై జండా కర్తలతో దాడికి దిగారు.. వెంటనే గవర్నర్ భద్రత సిబ్బంది అప్రమత్తమై గవర్నర్ ను సురక్షితంగా అక్కడి నుంచి పంపి వేశారు..ఈ ఘటనలో ఎస్ ఎప్ ఐ కి చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట చేశారు..
కాగా తన వాహనంపై జరిగిన దాడిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఘాటుగా స్పందించారు. తనపై భౌతిక దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి విజయన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తన వాహనంపై కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. ఇది సీఎం చేయించిన పనేనని, వీరిని ఆయనే పంపారన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతున్నట్లు కనిపిస్తోందని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించారు.